Anant Ambani Wedding Gifts: అనంత్ అంబానీ దంపతులకు రూ.40 కోట్ల లగ్జరీ ఫ్లాట్ ఇచ్చిన షారుఖ్..ఎవరెవరు ఏం ఇచ్చారంటే?

Anant Ambani Wedding Gifts: అనంత్ అంబానీ దంపతులకు రూ.40 కోట్ల లగ్జరీ ఫ్లాట్ ఇచ్చిన షారుఖ్..ఎవరెవరు ఏం ఇచ్చారంటే?

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ను జూలై 12న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రాండ్ ఫంక్షన్‌లో సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలు ఇలా ప్రతి రంగంలోని ప్రముఖలు హాజరయ్యారు. 

అయితే..అనంత్ రాధికా దంపతులకు కళ్లు చెదిరే బహుమతులు ఇచ్చారంట సినిమా స్టార్స్. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అలియా భట్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, కౌశల్-కత్రినా, రణవీర్- దీపికా తదితరులు ఈ వివాహానికి అటెండ్ అయ్యారు. 

ఈ వివాహానికి విచ్చేసిన షారుఖ్ ఖాన్ ఫ్రాన్స్ లో రూ.40 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్ మెంట్ ను గిఫ్ట్ గా ఇచ్చారంట. అలాగే, దీపికా-రణ్‌వీర్ రూ.20 కోట్ల రోల్స్ రాయిస్ ఇచ్చారు. బచ్చన్ కుటుంబం రూ.30 కోట్ల విలువైన పచ్చ నెక్‌పీస్ ఇచ్చిందని తెలుస్తోంది. కౌశల్-కత్రినా జంట రూ.19 లక్షల బంగారు చైన్, అక్షయ్ కుమార్ రూ. 60 లక్షల బంగారు పెన్ ఇచ్చారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ రూ.15 కోట్ల విలువైన స్పోర్ట్స్ బైక్‌, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ రూ. 25 లక్షల విలువైన చేతితో తయారు చేసిన శాలువను బహుమతిగా ఇచ్చారని సమాచారం.

అయితే, బడా బిజినెస్ మేన్స్ అయిన ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ.300 కోట్ల ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇచ్చారని, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రూ.11.5 కోట్ల విలువైన విలాసవంతమైన కారును పెళ్లి కానుకగా ఇచ్చారని కొన్ని బాలీవుడ్ కథనాలు వెల్లడించాయి. అయితే ఇది వారు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ బహుమతుల సమాచారం వైరల్ అవుతుంది.