
బాలీవుడ్ డెబ్యూ యాక్ట్రస్ జాంకీ బోడివాలాకి (2025 IIFAలో) తన తొలి అవార్డు వరించింది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (SRK) చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకుంది. దాంతో స్టేజిపై నటి జానకి ఆనందంతో ఉప్పొంగిపోయి, "కల నిజమైంది" అంటూ ఎమోషనల్ అయి మాట్లాడింది.
ఆ వెంటనే షారుఖ్ ఖాన్ ఆమెను వేదికపై ఓదార్చుతూ.."భయపడకు. నేను నీకంటే ఎక్కువగా భయపడుతున్నాను" అని చెప్పి ఆమెను ఓదార్చాడు. దాంతో ఈ వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ.. అక్కడున్న ప్రేక్షకులకు వీపరీతంగా నచ్చేసింది. ఇక వారు తమ ఆనందంతో గట్టిగా చప్పట్లు కొడుతూ ఖుషి అయ్యారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో.. తన వినయంతో అభిమానులను గెలుచుకున్నాడు షారుఖ్ భాయ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే ఈ అవార్డు ప్రదానోత్సవం జైపూర్‌లో జరిగింది.
నటి జాంకీ బోడివాలా.. సూపర్ నేచురల్ థ్రిల్లర్ షైతాన్ మూవీకి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ గా అవార్డు గెలుచుకుంది. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో వచ్చిన షైతాన్ లో తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ది. క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలన తీసిన వికాస్ బెహల్ దీనికి దర్శకుడు.
అవార్డు అందుకున్న తర్వాత జాంకీ బోడివాలా తన ప్రసంగంలో.. 'షైతాన్ దర్శకుడు వికాస్ బహ్ల్ మరియు ఆమె సహ నటులు అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక మరియు అంగద్ రాజ్‌లకు' కృతజ్ఞతలు తెలిపారు.
షైతాన్ విషయానికి వస్తే:
2024 మార్చి 8న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హారర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను వణికించాయి. దాంతో.. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సైతాన్. ‘వశ్’ అనే గుజరాతీ సినిమాకు ఇది రీమేక్.
ALSO READ | War 2: వార్ 2 షూటింగ్ వాయిదా..ఎన్టీఆర్-హృతిక్ డ్యాన్స్ రిహార్సల్లో ప్రమాదం!
వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన కుటుంబం.. ఓ అపరిచిత వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడతారు. అతను ప్రయోగించిన డార్క్ మేజిక్ నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది అనేది అసలు కథ. ఒరిజినల్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేసిన గుజరాతీ నటి జానకీ బోడివాలా, హిందీలోనూ నటించింది.
ఇక పాతికేళ్ల తర్వాత ఈ సినిమాతో తిరిగి బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.