నస్పూర్, వెలుగు: ప్రమోషన్ తో మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్ఆర్పీ3 గని మేనేజర్ వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం గనిపై జరిగిన కార్యక్రమంలో 2024 వార్షిక సంవత్సరానికి సంబంధించిన ప్రమోషన్ ఆర్డర్లను ఉద్యోగులకు అందించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమోషన్ మరింత బాధ్యతను పెంచుతుందని, సంస్థ పట్ల అంకితభావంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు.
సూపర్వైజర్లకు కౌన్సెలింగ్
గైర్హాజరుపై మైనింగ్ సూపర్వైజర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గత వార్షిక సంవత్సరంలో 150 మస్టర్ల కన్నా తక్కువగా విధులకు హాజరైన మైనింగ్ సూపర్వైజర్లకు గని మేనేజర్ ఆఫీసులో ఎస్ఆర్పీ గ్రూప్ ఏజెంట్ చిప్ప వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. విధులు నిర్వహించే సిబ్బంది, కార్మికులకు సూపర్వైజర్లు ఆదర్శంగా నిలవాలని, విధులకు సక్రమంగా హాజరవుతూ ఉద్యోగుల చేత మన్ననలు పొందాలన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన
ఈ సందర్భంగా గని ఉద్యోగులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనా రాయణ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదా లను నివారించవచ్చన్నారు. బైకర్లు తప్పనిస రిగా హెల్మెట్‌ధరించాలని, రాంగ్ రూట్లో ప్రయాణించవద్దని, మద్యం తాగి వాహనాలను నడపొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి మహేందర్, సంక్షేమాధికారి సాధన్, యూనియన్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.