
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఎస్సారెస్పీ కాలువకు గండిపడింది. బురహాన్ పురం గ్రామం వద్ద కాలువకు బుంగ పడింది. దీంతో నీరు భారీగా వృథాగా పోతుంది. పంటనీరంతా పొలాల్లోకి పోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో భారీగా నీరు చేరడంతో ఎలా సాగు చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
పై నుంచి కాలువులోకి నీరు వదిలినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. గత మూడు నాలుగు ఏళ్లుగా ఎస్సారెస్పీలోకి నీరు వదిలితే తమ పొలాల్లోకి నీరు వస్తోందంటున్నారు. ఎస్సారెస్పీ కాలువ పనులు నాసిరకంగా చేయడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.