బాల్కొండ, వెలుగు: ఎస్సారెస్పీ ఆయకట్టులో యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ ప్రధాన కాకతీయ కాల్వకు బుధవారం నుంచి ఏడు రోజుల పాటు నీటిని విడుదల చేస్తామని ఎస్‌ఈ శ్రీనివాస్‌గుప్తా మంగళవారం ప్రకటించారు. జోన్ 1లో డీ5 నుంచి డీ53 పరిధిలోని ఆయకట్టుకు 7 రోజులు, జోన్11 కింద డీ54 నుంచి డీ94 కెనాల్స్ ద్వారా 8 రోజులు సాగునీటి విడుదల చేస్తామని ప్రకటించారు.
ఇందులో జోన్ 11కు డిసెంబర్ 25న ప్రారంభించి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో వచ్చే ఏడాది ఏప్రిల్ 8 వరకు నీటి విడుదల కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 80.05 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో యాసంగి సాగుకు ఎలాంటి ఢోకా లేదని ఆఫీసర్లు తెలిపారు. సాగు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఆఫీసర్లు సూచించారు.