
హైదరాబాద్, వెలుగు: మెడికల్ డివైజ్‌లు తయారు చేసే ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ నాస్‌డాక్‌లో లిస్టయింది. ఈ సంస్థ షేర్లు 'ఎస్ఎస్ఐఐ' అనే టిక్కర్ సింబల్‌తో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "నాస్‌డాక్‌లో లిస్టింగ్ కావడం ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్‌కు ఒక మైలురాయి. ప్రపంచ స్థాయి ఎస్ఎస్ఐ మంత్ర ఆపరేషన్ రోబోటిక్ వ్యవస్థను అభివృద్ధి చేయడం మాకు గర్వకారణం. అందుబాటులో ధరల్లో అత్యుత్తమ నాణ్యత, భద్రత, సామర్థ్యం గల ప్రొడక్టులను అందిస్తాం’’ అని అన్నారు. డిసెంబర్ 31, 2024తో ముగిసిన సంవత్సరానికి ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ 20.6 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది.