మలయాళ ఇండస్ట్రీ మేకర్స్ ఎంచుకునే కథల్లో వైవిధ్యత కనిపిస్తోంది. జనాల మధ్యలోనే తిరిగే కథలతో ఆధ్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలను రాసుకుంటారు దర్శక రచయితలు. భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా..చిన్న బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి.
గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు (Premalu) మూవీ కేరళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల (ఫిబ్రవరి 9న) మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. సుమారు రూ.3కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ప్రేమలు మూవీ రూ.80 కోట్ల కలెక్షన్ల మార్కును చేరుకుంది. నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ తెలుగులో రాబోతుంది.
లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ఉంది.వేరే ఊరి నుంచి హైదరాబాద్ వచ్చే సచిన్ సంతోష్ అనే యువకుడు..హైదరాబాద్‍లో జరిగిన ఓ పెళ్లిలో రేణు అనే అమ్మాయిని చూసి ఇష్టపడే సీన్తో ట్రైలర్ మొదలైంది. అతను ఇష్టపడ్డ విషయాన్ని రైలు జర్నీలో రేణుకు చెప్పేందుకు సచిన్ ప్రయత్నించే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే, రేణు నిద్రలో ఉండి ఆ మాట వినదు.ఇక రేణును ప్రేమలో పడేసేందుకు హైదరాబాద్‍లోనే గేట్ కోచింగ్ తీసుకునేందుకు సచిన్ డిసైడ్ అవ్వడం..ప్రేమలో పడేసేందుకు సచిన్ తంటాలు పడటం ఇంట్రెస్టింగ్ గా చూపించారు.“అమీర్ పేటలో అన్ని కోచింగ్‍లు ఇస్తారుగా..అమ్మాయిలను ఎలా పడేయాలో కూడా నేర్పిస్తే బాగుండు”..ప్రేమ మనిషిని గుడ్డోన్నే కాదురా..మెంటలోడ్ని కూడా చేస్తోంది, RRRలో చెప్పిన ‘నక్కి నక్కి కాదు..తొక్కుకుంటూ పోవాలి..అనే డైలాగ్స్ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ కలిగించారు.
ప్రేమలు తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందించారు. అతడు రాసిన డైలాగ్స్ ట్రెండ్‍కు తగ్గట్టు ట్రైలర్లో భలే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ(SS Karthikeya) సొంతం చేసుకున్నారు. మహా శివరాత్రి సందర్బంగా మార్చి 8న ప్రేమలు మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. మలయాళంలో యూత్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన ప్రేమలు..తెలుగు ఆడియన్స్కి ఎలా ఉంటుందో చూడాలి.