
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’(Baahubali Crown of Blood) అనే పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. బాహుబలి సీరీస్కు ముందు జరిగిన కథతో వచ్చిన ఈ ప్రీక్వెల్ స్టోరీకి దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో..ఆర్కా మీడియా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ సిరీస్ ని జీవన్ జే కాంగ్, నవీన్ జాన్ డైరెక్ట్ చేశారు.
ఇలాంటి ఓ సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెరకెక్కించిన ఈ యానిమేషన్ సిరీస్ హాట్‌స్టార్ లో శుక్రవారం (మే 17) నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అది కూడా ఏకంగా 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌ను ప్రధానంగా హిందీలో తెరకెక్కించారు. అనంతరం తెలుగు, మలయాళం, తమిళం, బెంగాళి, కన్నడ, మరాఠిలో కూడా అనువదించారు.
ప్రస్తుతం 8 భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అంతా బాగున్నప్పటికీ ప్రేక్షకులు నిరాశపరిచారు మేకర్స్ అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిర్వాహకులు.బాహుబలి ఫ్రాంఛైజీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సిరీస్ నుంచి కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే విడుదల చేశారు. ఇక ఆతర్వాత నుంచి వారానికి ఒక ఎపిసోడ్ ప్రీమియర్ చేస్తారని తెలుస్తోంది. అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తే బాగుండేదని, కేవలం 2 ఎపిసోడ్స్‌తో క్యూరియాసిటీని తట్టుకోలేమని ఆడియన్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
రక్తదేవ్ అనే శతృ సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్న కట్టప్పను ఓడించడానికి బాహుబలి, భల్లాలదేవ ఇద్దరు ఒకటై..ఒక సమరంగా చేతులు కలుపుతూ తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచేసింది.
మాహిష్మతి సామ్రాజ్యానికి ఇప్పుడు కల్పిత సామ్రాజ్యంగా చూపించిన ఈ సరికొత్త రాజ్యంలో ఉన్న మహా శత్రువు పేరు రక్తదేవ్. అతని రాజ్యంలో ఉన్న సైన్యానికి ముఖ్య సేనాధిపతి కట్టప్ప. ఇక బాహుబలి, బాహుబలి 2 లో తమకు శిక్షణ ఇచ్చిన వ్యక్తిపైనే..మన సైన్యం ఎలా గెలుస్తుందంటూ ఆలోచనతో నేరుగా బాహుబలి, భల్లాలదేవే రంగంలోకి దిగుతారు. ఇక మాహిష్మతి సామ్రాజ్యానికి తన పూర్తి జీవితాన్ని అంకితమిచ్చిన కట్టప్పే..ఈ సరికొత్త కథలో అదే మాహిష్మతిపై పోరాటం చేయడం అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో రావడం ఆడియన్స్ లో ఫుల్ జోష్ ఇస్తుంది. బాహుబలి యానిమేటెడ్ వెర్షన్ ఇప్పుడు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఏదేమైనా బాహుబలి, కట్టప్ప, శివగామి, భల్లాలదేవ, దేవసేన పాత్రలు ఇందులో ఎలా ఉండబోతున్నాయి.? ఇంకా ఏవైనా కొత్త పాత్రలు కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అనే పూర్తి వివరాలు తెలియాలంటే స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ యానిమేటెడ్ సిరీస్ ని చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.
Witness the battle of the crown!?
— Disney+ Hotstar (@DisneyPlusHS) May 16, 2024
Hotstar Specials S.S. Rajamouli’s Baahubali : Crown of Blood is now streaming.#BaahubaliOnHotstar
Watch Now: https://t.co/NMOwR6sFmr pic.twitter.com/rejOBR4QIW