SSMB29: మ‌హేష్ని ఓ రేంజ్లో సాన‌బెడుతున్న డైరెక్టర్ జక్కన్న.. స్పెషల్ ట్రైనింగ్ కోసం చైనాకి సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  హీరోగా జక్కన్న (SS Rajamouli) తెరకెక్కిస్తున్న SSMB 29 నుంచి ఓ వార్తా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నాడట. అది కూడా చైనాకి వెళ్లి మార్ష‌ల్ ఆర్స్ట్ నేర్చుకోనున్నాడట.

ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్లో మహేష్ నటించడానికి మార్ష‌ల్ ఆర్స్ట్కి సంబంధించిన బేసిక్ ట్రైనింగ్ అస‌వ‌ర‌మ‌ని జక్కన్న భావించాడట.అందుకోసం జనవరి మూడవ వారంలోనే వీరిద్దరూ చైనాకు పయనమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్క‌డ ప్ర‌త్యేక‌మైన నిపుణుల ట్రైనింగ్ ఇనిస్ట్యూట్లో మహేష్ బాబుకి శిక్ష‌ణ ఉంటుంద‌ని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది.

అలాగే మహేష్ బాబు ఆఫ్రికాలోని మ‌సాయి-పిగ్మీస్ తెగ‌ల మ‌ధ్య బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు టాక్. ఇలా చూస్కుంటే ఈ సినిమా కోసం మహేష్ బాబు విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే తన సినిమాల్లో ప్రభాస్, రానా, చరణ్, ఎన్టీఆర్ ల చేత హార్స్ రైడింగ్, కర్ర, కత్తి సామూలాంటివి నేర్పించి సక్సెస్ అయ్యాడు  రాజమౌళి. ఇప్పుడు  మహేష్ బాబుతో అంతకు మించి అనేలా యుద్ధం చేయబోతున్నాడని అర్ధమవుతోంది. 

Also Read :- ప్రభాస్ కి కాబోయే భార్య తెలుగమ్మాయేనా.?

SSMB 29 కోసం హనుమంతుడి స్ఫూర్తితో మహేష్ బాబు పవర్‌ఫుల్ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. పొడవాటి జుట్టు పెరగడం మరియు కండలు తిరిగిన శరీరాకృతితో సహా అతను పూర్తి మేక్ఓవర్‌ని రెడీ చేసుకున్నాడు. అంతేకాకుండా    

అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ గా వస్తోన్న SSMB 29 ఈ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

SSMB29 బడ్జెట్:

దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ SSMB 29 నిర్మిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగాన్ని 2027లో, రెండవ భాగాన్ని 2028లో విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించవచ్చని తెలుస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించవచ్చని టాక్. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.