లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. SSMB29 మూవీ లాంచ్ ఇవాళ జనవరి 2న జరుగుతున్నట్లు వినిపిస్తోంది. అయితే, దర్శకుడు రాజమౌళి నుంచి, మేకర్స్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అయినప్పటికీ వారి సన్నిహితుల సమాచారం మేరకు SSMB29 మూవీ లాంఛ్ ఉండనుందని బలంగా చర్చ నడుస్తోంది.
అయితే, సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ లాంచ్ చాలా సీక్రెట్ గా జరగనుందని టాక్. అంతేకాకుండా కేవలం మూవీ టీమ్ మాత్రమే పాల్గొనబోతున్నట్లు.. మీడియాకి ఆహ్వానం లేదని, అందుకు ఎలాంటి కవరేజ్ ఉండదని తెలుస్తోంది. SSMB29 లాంచ్ బజ్‍తో సోషల్ మీడియాలో మోతెక్కుతోంది. జస్ట్ ప్రారంభం మాత్రమే ఉంటుందా.. డైరెక్టర్ రాజమౌళి ప్రెస్‍మీట్ కూడా ఏమైనా పెడతారా అనే ఆసక్తి నెలకొంది.
Also Read : ధనుష్ ఇడ్లీ కడాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
అంతేకాకుండా లాంచ్ కు మహేశ్ బాబు అటెండ్ అవుతారా లేదా అనేది కూడా తీవ్ర ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు మూవీ ప్రకటన తప్ప.. ఏ ఒక్క అప్డేట్ రాకపోయినా..ఇండియన్ సినీ ఫ్యాన్స్ వేరే లెవెల్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా ముందు సినిమాల మాదిరి రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టనున్నాడా అనేది అందరిలో మెదిలే ప్రశ్న. కానీ, రాజమౌళి ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టట్లేదని తెలుస్తోంది. స్టోరీ లైన్ రివీల్ చేసి ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచే జక్కన్న.. ఇపుడు మహేష్ సినిమా కోసం మాత్రం రూట్ మార్చినట్లు సమాచారం.
మరోపక్క మహేశ్ బాబు మూవీ లాంచ్ కి అటెండ్ అయ్యే ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. సాధారణంగా తన సినిమా పూజా కార్యక్రమాల్లో మహేశ్ పాల్గొనరు. సెంటిమెంటుగా ఆయన తన సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు సితార లేదా గౌతమ్ లను మాత్రమే సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకి పంపిస్తుంటారు. మరి ఈసారి కూడా ఇదే సెంటిమెంట్ పాటిస్తారా? లేదా? అన్నది చూడాలి. ఇకపోతే భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.