SSMB29: మహేష్..రాజమౌళి మూవీ రెండు భాగాలు కాదు.. అనౌన్స్ మెంట్ వీడియో రానుంది!

SSMB29: మహేష్..రాజమౌళి మూవీ రెండు భాగాలు కాదు.. అనౌన్స్ మెంట్ వీడియో రానుంది!

మహేష్ - రాజమౌళి SSMB 29 మూవీ రెండు భాగాలుగా రూపొందబోతున్నట్లు కొంతకాలంగా వినిపిస్తోంది. కానీ, SSMB29 మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రాజమౌళి SSMB29 మూవీని రెండు భాగాలుగా విభజించకుండా.. ఒక పార్ట్ లోనే కథ చెప్పనున్నట్లు టాక్. ఎందుకంటే, కథను లాగకుండా చెప్పాల్సింది ఒక పార్ట్ లోనే అర్ధవంతంగా చెప్పే రిసల్ట్ను జక్కన్న నమ్ముతున్నాడట. అందుకు సరైన  కారణం లేకపోలేదు. 

ఇప్పటికే చాలా మంది చిత్రనిర్మాతలు, అనవసరంగా రెండు భాగాలు అంటూ వస్తున్నారు. వారు ముఖ్యంగా సినిమాను రెండు పార్ట్లు తీసేది, వచ్చే డబ్బుల కోసమే అని అందరికే తెలిసిందే. కానీ, అలా వచ్చి సినిమాలోని కంటెంట్‌ను సాగదీస్తున్నారు. అలా వచ్చిన చాలా సినిమాలు భారీ డిజాస్టర్స్ అందుకున్నాయి.

అయితే, దేవర, సలార్ వంటి సినిమాల్లో దర్శకులు ఉద్దేశపూర్వకంగానే డబ్బుల కోసం కథలను సాగదీసారు. కానీ బాహుబలితో రెండు భాగాల ఫార్మాట్ ట్రెండ్‌ను ప్రారంభించిన రాజమౌళి, ఈ పద్ధతి నుండి బయటపడాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే RRRతో మళ్ళీ ఒక్క భాగాన్నే ఎంచుకున్నాడు జక్కన్న.

ఇపుడు SSMB29 కోసం అదే ఫార్మాట్ను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు SSMB29 రన్‌టైమ్ దాదాపు 3 గంటల 30 నిమిషాలు ఉంటుందని అంచనా. ఇది సరైన నిర్ణయమని సోషల్ మీడియాలో జక్కన్న ఫ్యాన్స్, సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే, ఈ మూవీ 2027 విడుదలయ్యే అవకాశం ఉంది. 

అలాగే, ఈ ఏప్రిల్ నెలలో SSMB 29 కథను చెప్పే హై-ఇంపాక్ట్ వీడియో ఒకటి రానుందని టాక్. ఇది 2-నిమిషాల వీడియోతో సినిమా నేపథ్యాన్నిఆవిష్కరించేలా ఉండనుందట. అందుకు SSMB29 బృందం సిద్ధమవుతోందని కొత్త టాక్ మొదలైంది. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. .

నిజానికి దర్శక ధీరుడు రాజమౌళి మేకింగ్ థాట్ వేరే. ఎవ్వరికీ అంత త్వరగా అంతు చిక్కదు. లైఫ్‌స్టైల్ అడ్వెంచర్, ఇతిహాస కథనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దానికి తోడు హ్యూమన్ ఎమోషన్స్ను కళ్ళకు కట్టినట్లుగా చూపించి వరుస విజయాలు అందుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే SSMB 29 సినిమా.. చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని సమాచారం. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో భారీ సెట్‌లో SSMB29 బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తోంది. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసిందేకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడట.