SSMB 29 Launch: మహేశ్ బాబు-రాజమౌళి మూవీ లాంచ్‍కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే?

SSMB 29 Launch: మహేశ్ బాబు-రాజమౌళి మూవీ లాంచ్‍కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే?

మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న SSRMB29 నుంచి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ లాంచ్‍కు డేట్ ఫిక్స్ అయిందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

న్యూ ఇయర్ సందర్భంగా గురువారం (2025 జనవరి 2న) పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షురూ కానుందని సమాచారం. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటలకు ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, అది నిజమే అంటూ దర్శకుడు రాజమౌళికి సన్నిహితంగా ఉండే వారు, మహేష్‌ బాబుకి క్లోజ్‌గా ఉండే కొందరి నుంచి బలంగా వినిపిస్తోంది. ఇవాళ జనవరి 1న లాంచ్‍కు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. 

దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ రానున్న ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

Also Read :  2024 లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాప్ సెలబ్రేటిస్ వీళ్లే

జక్కన్న ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్ట్ ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ 2027లో రెండో పార్ట్‌ని 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

హై-వోల్టేజ్ యాక్షన్‌ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.