ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైపుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న మూవీ (SSMB29) అని చెప్పాలి.
టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందారు మహేష్ బాబు. దీంతో వీరిద్దరి ప్రాజెక్ట్ పై చిన్న న్యూస్ తెలిసిన చాలు..అది మాకు ఎంతో సంతోషం అంటూ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు నటులతో పాటు టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని, లొకేషన్స్ వేట కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో రాజమౌళికి ఇష్టమైన చిత్రీకరణ లొకేషన్ అయిన..అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ నిర్మాణం జరుగుతుందని సమాచారం. ఇది మే చివరి నాటికి పూర్తవుతుందట. ఇక జూన్‌లో షూటింగ్ స్టార్ట్ కానుంది. అలాగే, ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వైడ్ గా పలు కీలకమైన ప్రదేశాల్లో షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.
దాదాపు రెండు సంవత్సరాల పాటు మహేష్..రాజమౌళి షూటింగ్ సెట్ లోనే గడిపే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున..రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
ALSO READ :- తెలుగురాష్ట్రాల్లో ఎగ్జామ్ రాసిన 12 లక్షలమంది పదో తరగతి విద్యార్థులు
హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.