తెలుగు యాంకర్ తో డైరెక్టర్ రాజమౌళి లవ్ ట్రాక్.. వీడియోలు కూడా బయటికొచ్చాయా..?

తెలుగు యాంకర్ తో డైరెక్టర్ రాజమౌళి లవ్ ట్రాక్.. వీడియోలు కూడా బయటికొచ్చాయా..?

తెలుగు సినిమాలని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ స్టార్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి గురించి దాదాపుగా తెలియని వారుండరు. అయితే రాజమౌళి ఇప్పటివరకూ 12 సినిమాలు తీయగా ఇందులో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. దీంతో ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకులలో టాప్ లో కొనసాగుతున్నాడు. అయితే రెండు రోజులుగా రాజమౌళికి సంబందించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు రాజమౌళి అప్పట్లో తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్ తో ప్రేమలో పడ్డాడని వీళిద్దరూ కలసి తిరుగుతున్న వీడియోలు కూడా వచ్చాయంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అప్పట్లో యనకృ రష్మీ నటించిన యువ సీరియల్ బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఓ సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకుడు రాజమౌళి ఈ సీరియల్ లో యాక్ట్ చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి, యాంకర్ రష్మీ గౌతమ్ కల్సి తిరుగుతున్న క్లిప్పింగ్స్ కొన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేతప్ప లవ్ ట్రాక్ గట్రా ఏమీ లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

Also Read :- వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్స్ సీన్స్

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో  SSMB29(వర్కింగ్ టైటిల్) తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కి జంటగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒరిస్సా స్టేట్ లోని ఓ అడవి ప్రాంతంలో జరుగుతోంది. అయితే రాజమౌళి ఈ మధ్య ఎక్కువగా నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్, బాహుబలి, తదితర సినిమాలతో తెలుగు సినిమాలని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక మహేష్ SSMB29 సినిమాతో హాలీవుడ్ లో పాగా వెయ్యాలని చేస్తున్నాడు. దీంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బడ్జెట్ కూడా దాదాపుగా రూ.1200 కోట్లు పైగా ఉన్నట్లు సమాచారం.