ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైపుడ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న మూవీ (SSMB29) అని చెప్పాలి.
టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి.అలాగే ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందారు మహేష్ బాబు. దీంతో వీరిద్దరి ప్రాజెక్ట్ పై చిన్న న్యూస్ తెలిసిన చాలు..అది మాకు ఎంతో సంతోషం అంటూ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు స్పెషల్గా SSMB29 నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూసారు. ఎలాంటి అప్డేట్ రాకపోయేసరికి పూర్తిగా డిస్సపాయింట్ అయ్యారు. కానీ, సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపొయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు వరల్డ్ వైడ్ టాప్ క్యాస్టింగ్ ఎంపికపై జక్కన్న ఫోకస్ చేస్తూనే మరో వైపు ఇతర సినిమా నిర్మాణంలో కూడా వేగం పెంచుతున్నారు.
లేటెస్ట్గా ఈ మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya). ఇందులో డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని.. రాజమౌళి తనయుడు కార్తికేయ షూట్ చేసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోలో మహేష్ బాబు ‘టక్కరిదొంగ’ సినిమాలోని నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ ప్రయాణం చేస్తున్నారు రాజమౌళి. దాంతో సిచువేషన్ కి తగ్గట్లుగానే ఈ పాటకూడా ఉందనే కామెంట్స్ ఆ వీడియోని చూసిన నెటిజన్స్ చేస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, మహేష్ సినిమా కోసం తన టీమ్తో కలిసి సౌతాఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది. SSMB29 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ కావడంతో, ఎక్కువ భాగం అడవుల్లోనే షూటింగ్ ప్లాన్ చేసేలా పక్క ప్రణాళికతో రెడీ అయ్యారు. ఇందుకోసం దక్షిణాఫ్రికాలో కొన్ని దట్టమైన అడవుల్లో జక్కన్న తన బృందంతో కలిసి రెక్కీ నిర్వహించనున్నారు. మునుపెన్నడు చూడని విధంగా ఇండియన్ స్క్రీన్పై అదిరిపోయే లొకేషన్స్లో ఈ సినిమాని షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే, ఈ సినిమా ఎక్కువభాగం రియల్ లొకేషన్స్లో మాత్రమే ఉంటుంది. ఇదివరకైతే మహేష్ బాబు 'అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు, రామోజీ ఫిలింసిటీ, బయట సెట్స్ లోనే ఎక్కువ భాగం పాల్గొనేవాడు. ఇక ఇప్పుడు అడవుల్లో అడుగుపెట్టబోతున్నాడు.
Nindu chandrudu oka vaipu chukkalu okavaipu 🤌 @urstrulyMahesh @ssk1122 @ssrajamouli ♥️ #SSMB29 pic.twitter.com/vWDuRQkQ8z
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) October 22, 2024
ఇకపోతే హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.