ఆర్.ఆర్.ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రముఖ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తన నెక్ట్స్ సినిమాకి రెడీ అవుతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్న ఈ దర్శకధీరుడు ఈసారి తెలుగు సినిమాని హాలీవుడ్ కి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితెహ్ ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి SSMB29 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్ కోసం ఆఫ్రీకా అడవులను చుట్టేసి వచ్చారు.
అయితే టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం జక్కన్న తన టీమ్ తో కలసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఓడిశాలోని దేవ్ మాలి, తోలో మాలి, కోలా బ్, పుట్ సీల్ ప్రాంతాలలో జక్కన్న టీమ్ షూటింగ్ లొకేషన్స్ వేట మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ లొకేషన్స్ లో ఫారెస్ట్ యాక్షన్స్ అడ్వెంచర్ సీన్స్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో 3 రోజులపాటు ఈ లొకేషన్స్ లో ఉండబోతున్నట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా రాజమౌళి SSMB29 సినిమాని ఇంటర్ నేషనల్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోకుండా తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపుగా రూ.1200 కోట్లు పైగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో మహేష్ కి జోడీగా బాలీవడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో పాటూ మరో కొరియన్ నటి నటిస్తోంది. ఈ సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.