సూపర్ హిట్ వైబ్‌‌‌‌ని క్రియేట్ చేసింది : నాని ‘హిట్ : ది థర్డ్ కేస్’పై రాజమౌళి

సూపర్ హిట్ వైబ్‌‌‌‌ని క్రియేట్ చేసింది : నాని ‘హిట్ : ది థర్డ్ కేస్’పై రాజమౌళి

నాని, శ్రీనిథి శెట్టి జంటగా నటించిన  చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్’. ఈ ఫ్రాంచైజీలో శైలేష్ కొలను రూపొందించిన  మూడో చిత్రమిది.  నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ‘నాని నుంచి మనం చాలా కోరుకుంటాం. తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంది.  కానీ తన  నుంచి నేను ఇంకా ఎక్కువ ఎక్స్‌‌‌‌పెక్ట్ చేస్తాను. అయితే  నేను ఊహించినదానికంటే నాని ఇంకా ముందుకెళ్లాడు.  ఫ్రాంచైజీలు క్రియేట్ చేసి సినిమాలు తీయడం చాలా గొప్ప విషయం. శైలేష్‌‌‌‌ విజన్‌‌‌‌కు నా అభినందలు.

 ఇక ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని నాకు బాగా నచ్చాయి.  సినిమా సూపర్ హిట్ అవుతుందనే  వైబ్‌‌‌‌ని క్రియేట్ చేశాయి. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.  నాని మాట్లాడుతూ ‘ఒక  థ్రిల్లర్‌‌‌‌, ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే ఎలా ఉంటుందో హిట్ 3 అలా ఉంటుంది. ఇదొక ఆర్గానిక్ కాంబినేషన్. ఇందులో వయెలెన్స్‌‌‌‌  ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అందరికీ  ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ అందిస్తానని ప్రామిస్ చేస్తున్నా.

 ఈ సినిమా విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నా’ అని చెప్పాడు.   హిట్ యూనివర్స్‌‌‌‌లో నటించిన  హీరోలు  విశ్వక్ సేన్, అడివి శేష్ కార్యక్రమంలో పాల్గొని  సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ చిత్రంతో తెలుగు డెబ్యూ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, నానితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ అని  హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెప్పింది. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ ‘రాజమౌళి గారు మా లక్కీ చార్మ్. నా విజన్‌‌‌‌లో బోర్డ్ అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాని అన్నకు సినిమాలపై ఎంతో ప్యాషన్ ఉంది. నన్ను నమ్మిన ఆయనకు ఎంత థ్యాంక్స్ చెప్పిన తక్కువే. ఈ చిత్రం చాలా వయెలెంట్‌‌‌‌గా ఉంటుంది. అందరికీ గ్రేట్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇస్తుంది’ అని చెప్పాడు. నటులు సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్, అమిత్, కోమలీ ప్రసాద్,  ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర, నిర్మాత ప్రశాంతి తిపిర్నేని సహా టీమ్ అంతా పాల్గొన్నారు.