SS Rajamouli: వందేళ్ల నిరీక్షణకు ముగింపు.. ‘ఆస్కార్’కు రాజమౌళి ప్రత్యేక ధన్యవాదాలు

SS Rajamouli: వందేళ్ల నిరీక్షణకు ముగింపు.. ‘ఆస్కార్’కు రాజమౌళి ప్రత్యేక ధన్యవాదాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ 'ఆర్ఆర్ఆర్' (RRR). ఈ మూవీ వరల్డ్ వైడ్ సెట్ చేసిన సంచలనం సంగతి అందరికీ తెలిసిందే. నాటు నాటు సాంగ్కి ఆస్కార్ సైతం అందుకుంది. ఈ సినిమా రిలీజై 3 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ RRR నుండి ఏ చిన్న న్యూస్ వినిపించిన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

అయితే లేటెస్ట్గా సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల వేదిక కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్కార్ లో కొత్తగా 'స్టంట్ డిజైన్' విభాగాన్ని చేర్చుతున్నట్లు ప్రకటించింది. 2028 నుంచి ఈ విభాగంలో ఆస్కారు పురస్కారాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

2027లో విడుదలయ్యేసి నినిమాలను ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. ఈ మేరకు అకాడమీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. దీనికి హాలీవుడ్ చిత్రాలు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అల్ ఎట్ వన్స్, అలాగే టామ్ క్రూయిస్ మిషన్ ఇంపాజిబుల్ స్టంట్స్ పోస్టర్స్ తో పాటు నుంచి RRR లోని రామ్ చరణ్ స్టంట్ని కూడా యాడ్ చేశారు.

ఈ పోస్టర్లో RRRవిజువల్స్ ఉండడంతో తెలుగు ఆడియన్స్ ఆనందిస్తున్నారు. ఇది మన భారతీయ సినిమాకు దక్కిన గౌరపమంటూ కామెంట్ పెడుతున్నారు. మరోవైపు ఆస్కార్లో కొత్త కేటగిరీపై రాజమౌళి స్పందించారు.

'వందేళ్ల నిరీక్షణకు ముగింపు. 2027లో రిలీజయ్యే చిత్రాలకు స్టంట్ డిజైన్ కేటగిరీలో ఆస్కార్ ఇస్తారని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఈ నిర్ణయానికి కారకులైన డేవిడ్ బెయిచ్, క్రిస్ ఓ హర, అకాడమీ సీఈవో బిల్ క్రామర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్, అలాగే స్టంట్ నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు. స్టంట్ డిజైన్ ఆస్కార్ అంటూ మీరు రిలీజ్ చేసిన పోస్టర్లో RRR విజువల్ చూసి థ్రిల్లయ్యాను' అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.