
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సంతకం చేసి ఫొటో దిగారని ఆర్టీఏ జేటీసీ రమేశ్‌కుమార్ తెలిపారు.
మహేశ్‌బాబుతో తీస్తున్న సినిమా షూటింగ్లో భాగంగా రాజమౌళి విదేశాలు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్రెన్యువల్కోసం వచ్చారు.