-
హాజరు కానున్న 51 వేల మంది
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెం టరీ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నా యి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు 51,237 మంది హాజరుకాను న్నారు. దీంట్లో 31,625 మంది అబ్బాయి లు, 19,612 మంది అమ్మాయిలు ఉన్నారు.
వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు 38 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ టీములను ఏర్పాటు చేయగా, 2 వేల మంది వరకు ఇతర సిబ్బందిని నియమించినట్టు పేర్కొన్నారు. స్టూడెంట్లు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.