
సీబీఐ, ఎన్ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సీబీఐసీ లాంటి కేంద్ర సంస్థల్లో సబ్ఇన్స్పెక్టర్స్ సహా వివిధ విభాగాల్లో గ్రూప్‘-బి’, గ్రూప్-‘సి’ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(సీజీఎల్)-2021 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ అర్హతతోనే సెంట్రల్ కొలువుకు అవకాశం ఉన్న సీజీఎల్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందో ఈ వారం తెలుసుకుందాం..
సెంట్రల్ కొలువుల్లో ప్రధానమైన పోస్టులు ఉండే సీజీఎల్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎంతో ఎదురుచూస్తుంటారు. నాలుగు అంచెల్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉండడంతో పాటు పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. సిలబస్‌ను అవగాహన చేసుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే కొలువు సాధించడం సులువే.
నోటిఫికేషన్
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక నాలుగు అంచెలుగా జరుగుతుంది. నాలుగో అంచె (టయర్-4) కొన్ని పోస్టులకు మాత్రమే. అభ్యర్థులందరూ మూడు అంచెల విధానాన్ని పాటించాల్సిందే.
దరఖాస్తులు : ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు : రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ మహిళలకు ఫీజు లేదు.
చివరి తేదీ : 25 జనవరి 2022.
ఎగ్జామ్ సెంటర్స్ : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
టయర్-1 ఎగ్జామ్ : ఏప్రిల్, 2022.
టయర్-2 ఎగ్జామ్ : పరీక్ష తేదీ వెల్లడించాల్సి ఉంది.
వెబ్సైట్ : www.ssc.nic.in
పోస్టులు: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్/ సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్), ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్, డివిజనల్ అకౌంట్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ యూడీసీ, టాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్.
అర్హత:
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ/ ఎంకాం/ ఎంబీఏ(ఫైనాన్స్)/ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
- జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు 60% ఉత్తీర్ణతతో డిగ్రీ పూర్తిచేసి, 10+2లో మ్యాథ్స్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇతర అన్ని పోస్టులకూ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
వయసు: పోస్టును బట్టి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
సిలబస్
జనరల్ ఇంటెలిజెన్స్& రీజనింగ్: క్లాసిఫికేషన్, అనాలజీ, కోడింగ్–డీకోడింగ్, ఫజిల్, మ్యాట్రిక్స్, వర్డ్ ఫార్మేషన్, వెన్ డయగ్రామ్, డైరెక్షన్ & డిస్టాన్స్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ & సోషల్ ఇంటెలిజెన్స్.
జనరల్ అవేర్నెస్: స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ (ఇండియన్ హిస్టరీ, కల్చర్ తదితర), సైన్స్, కరెంట్ ఎఫైర్స్, స్పోర్ట్స్, బుక్స్ & ఆథర్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్, పోర్ట్‌ఫోలియోస్, పీపుల్ ఇన్ న్యూస్, కంప్యూటర్స్, అవార్డులు, జాగ్రఫీ, ఎకానమి, పాలిటీ, పాపులేషన్ సెన్సెస్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: సింప్లిఫికేషన్, ఇంట్రెస్ట్, యావరేజెస్, పర్సెంటేజ్, రేషియో & ప్రపోర్షన్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, టైం & వర్క్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్: రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ప్రేజస్ & ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఎరర్ స్పాటింగ్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, ఇడియమ్స్ & ప్రెజెస్.
ఎగ్జామ్ ప్యాటర్న్:
టయర్1: టయర్ 1 ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. ఎగ్జామ్ డ్యురేషన్ 60 నిమిషాలు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.
టయర్ 2: టయర్ 1లో క్వాలిఫై అయిన అభ్యర్థికి టైర్ 2 ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇందులో ప్రతి సబ్జెక్టుకు 200 మార్కులు ఉంటాయి. రెండు గంటల టైం ఉంటుంది. టైర్ 2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ విభాగంలో ప్రతి తప్పు సమాధానానికి పావుమార్కు, మిగతా విభాగాల్లో ప్రతి తప్పు ఆన్సర్‌కు అర మార్కు తగ్గిస్తారు.
టయర్ 3: టయర్ 3 పూర్తిగా డిస్క్రిప్టివ్ టైప్ పేపర్. అభ్యర్థులు గంట టైంలో ఇంగ్లిష్ లేదా హిందీ భాషలో ఎస్సేలు/ లెటర్/ అప్లికేషన్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష క్వాలిఫైయింగ్ ఎగ్జామ్.
టయర్ 4: మూడు దశల్లో ప్రతిభ చూపించి టైర్ 4కు ఎంపికైన అభ్యర్థులకు టయర్ 4లో పోస్టును బట్టి కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎస్ఎఫ్ఐవో పోస్టులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్టులో వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్, జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. సెంట్రల్ ఎక్సైజ్ & ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు డేటా ఎంట్రీ స్పీడ్ గంటకు 8 వేల కీ డిప్రెషన్ ఉండాలి.
-వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్