ఇంటర్ విద్యార్హతతో భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, కార్యాలయాల్లో ఉన్న 3,712 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఇంటర్‌మీడియట్(12వ తరగతి) అర్హత. విద్యార్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 7వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 3,712.
విభాగాలు:
- లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ)
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
- డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో)
- డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-ఎ)
విద్యార్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయో పరిమితి: 01-08-2024 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు.. ఓబీసీలకు 3 ఏళ్లు.. దివ్యాంగులకు 10-15 ఏళ్లు వయో సడలింపు కలదు.
జీతభత్యాలు:
- లోయర్ డివిజన్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: రూ.19,900 నుంచి రూ.63,200.
- డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.25,500 నుంచి రూ. 81,100.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎ: రూ.29,200 నుంచి రూ.92,300.
ఎంపిక విధానం: మొదట టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక ఉంటుంది. ఆ తరువాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి కంప్యూటర్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆపై సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు లేదు. ఇతరులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్.
ముఖ్యమెన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 08-04-2024.
దరఖాస్తులకు చివరి తేదీ: 07-05-2024.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08-05-2024.