మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు... హాల్​ టికెట్​ ఇలా డౌన్​ లోడ్​ చేసుకోండి...

మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు... హాల్​ టికెట్​ ఇలా డౌన్​ లోడ్​ చేసుకోండి...

మార్చి 18వ తేదీ నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు మార్చి 7వ తేదీ సాయంత్రం  అందుబాటులోకి రానున్నాయి.  SSC హాల్​ టికెట్లు వెబ్ సైట్​ నుంచి ఎలా డౌన్​ లోడ్​ చేసుకోవాలో తెలుసుకుందాం. . . .

 తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీన ప్రారంభమై...ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నాయి.  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 18వ తేదీనే ఇంటర్ పరీక్షలు(Telangana Inter Exams 2024) కూడా ముగియనున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలకు టైం దగ్గరపడుతున్న వేళ హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. . మార్చి 7వ తేదీ నుంచి హాల్ టికెట్లు(download TS SSC Hall Ticket) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు మొదటగా https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • SSC Examinsation March -2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను ఎంట్రీ నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే అప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ఇప్పటికే పాఠశాలలకు విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను పంపించింది పదో తరగతి పరీక్షల బోర్డు. అయితే వెబ్ సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా వీటిని మార్చి 7వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.

 తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్

  • మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
  • మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
  • మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
  • మార్చి 23- మ్యాథమెటిక్స్
  • మార్చి 26- సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
  • మార్చి 28- సైన్స్ పేపర్ -2(బయాలజీ)
  • మార్చి 30- సోషల్ స్టడీస్
  • ఏప్రిల్ 1- ఒకేషనల్‌ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్‌)‌,
  • ఏప్రిల్ 2- ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్‌)

గత అనుభవాల దృష్ట్యా మాల్ ప్రాక్టీస్ ను అడ్డుకునేందుకు, ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి లీకేజీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణపై ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని… ఎలాంటి లోపాలు ఉండవద్దని సూచించారు. ముఖ్యంగా లీకేజీ వంటి ఘటనలకు అవకాశం ఇవ్వొద్దని.. ఇన్విజిలేటర్లు కూడా ప్రభుత్వం సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా చర్యలు కూడా పకడ్బందీగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.


ALSO READ :- Vikramarkudu 2: రవితేజ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ సిద్ధం.. డైరెక్టర్ ఎవరో తెలుసా?