ఇంటర్‌తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. 2వేల స్టెనోగ్రాఫర్ పోస్టుల నోటిఫికేషన్

ఇంటర్‌తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. 2వేల స్టెనోగ్రాఫర్ పోస్టుల నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్ గ్రేడ్  సి(గ్రూప్  బి, నాన్ గెజిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది.ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆగస్టు 17వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.

1-ఆగస్టు -2024 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18- నుంచి 30 ఏళ్లు, గ్రేడ్- డి పోస్టులకు 18- నుంచి 27 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు.

Also Read :- చికెన్ బిర్యానీలో బొద్దింక

సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (100 ప్రశ్నలు- 100 మార్కులు). ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. మొత్తం 200 మార్కులకు పరీక్ష 2 గంటలు ఉంటుంది.


దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అక్టోబర్ లేదా నవంబర్​లో నిర్వహిస్తారు.