
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హతలు: పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ (హిందీ, ఇంగ్లీష్). డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లీష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్‌లేషన్(హిందీ, ఇంగ్లీష్) డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు మూడేళ్ల ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ, పీజీ (హిందీ, ఇంగ్లీష్) అర్హతతోపాటు తగు అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీనియర్ సెకండరీ స్థాయిలో రెండేళ్ల హిందీ బోధన అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.ssc.nic.in వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి.