Telangana SSC Result 2025: టెన్త్ రిజల్ట్ రిలీజ్.. మహబూబాబాద్ జిల్లా ఫస్ట్.. వికారాబాద్ జిల్లా లాస్ట్

Telangana SSC Result 2025: టెన్త్ రిజల్ట్ రిలీజ్.. మహబూబాబాద్ జిల్లా ఫస్ట్.. వికారాబాద్ జిల్లా లాస్ట్

 తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి టెన్త్ రిజల్ట్ ను రిలీజ్ చేశారు. మొత్తం పదో తరగతి పరీక్షలో   92.78 ఉత్తీర్ణత  సాధించారు.  బాలురు ఉత్తీర్ణత  91.32సాధించగా,  బాలికలు  94.26 శాతం సాధించారు.  బాలికల కంటే బాలురు 2.64 అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

ప్రైవేట్ స్కూల్స్ లో పాస్ పర్సంటేజ్ 57.22 శాతం. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 55.14 శాతంగా ఉండగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 61.70 శాతంగా ఉంది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత 6.56 శాతం అధికం.

రాష్ట్రంలోని 4 వేల 629 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేవలం 2 పాఠశాలలు మాత్రమే పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎవరూ పాస్ కాలేదు.ఈ సారి ఫలితాల్లో  సబ్జెక్ట్ లకు  గ్రేడ్లకు బదులు మార్కులు ఇచ్చారు.  అత్యదికంగా ఉత్తీర్ణతో  మహబూబాబాద్  ఫస్ట్ ప్లేసులో ఉండగా..అతి తక్కువ ఉత్తీర్ణతతో వికారాబాద్ చివరి స్థానంలో ఉంది.

https://results.bsetelangana.org/

రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. 5,09,403 మంది హాజరయ్యారు. వారం క్రితమే ఫలితాల ప్రక్రియ పూర్తికాగా.. ఫలితాలు ఎలా ఇవ్వాలనే దానిపై సర్కారు నుంచి స్పష్టత  కోసం ఎస్​ఎస్​సీ బోర్డు అధికారులు వెయిట్ చేశారు. మూడ్రోజుల క్రితం దీనిపై స్పష్టత రావడంతో బుధవారం ఫలితాలు ఇచ్చేందుకు వారు రెడీ అయ్యారు. అందులో భాగంగా మధ్యాహ్నం 2.15 గంటలకు ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.