లెక్కల్లో గట్టెక్కేదెట్లా? టెన్త్ స్టూడెంట్లలో ఆందోళన

  • 14 చాప్టర్లలో ఒక్కటీ పూర్తిగా తొలగించని విద్యాశాఖ
  • పలు చాప్టర్లలో అక్కడక్కడా కొన్ని టాపిక్స్ కట్

హైదరాబాద్, వెలుగు: టెన్త్ స్టూడెంట్లకు లెక్కల పరీక్ష బుగులు పట్టుకున్నది. ప్రభుత్వం అన్ని సబ్జెక్టుల్లో సిలబస్ కోతపెట్టినా, మ్యాథ్స్​లో మాత్రం నామమాత్రంగానే తీసేసింది. దీంతో స్టూడెంట్స్, పేరెంట్స్ లో టెన్షన్ మొదలైంది. లెక్కల్లో మరింత సిలబస్ తగ్గించాలని కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో 2019–20 విద్యాసంవత్సరం లేట్ గా మొదలైంది. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి 9,10వ తరగతుల స్టూడెంట్లకు ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేసింది. విద్యాశాఖ ఆఫీసర్ల లెక్కల ప్రకారం ఇప్పటివరకు 70శాతం సిలబస్​పూర్తయింది. ఈ ఆన్ లైన్ పాఠాలను70 నుంచి 80 శాతం మంది టెన్త్ స్టూడెంట్స్ వింటున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే వాస్తవ లెక్కలు దీనికి విరుద్ధంగా ఉన్నట్టు టీచర్లు చెప్తున్నారు. సగం మంది కూడా టీవీ పాఠాలు వినలేదని పేర్కొంటున్నారు. అయితే అన్ని సబ్జెక్టులు విని, చదువుకొని ఎగ్జామ్స్​రాసే అవకాశమున్నా, మ్యాథ్స్​సబ్జెక్టులో మాత్రం అది సాధ్యం కాదు. ఆ సబ్జెక్టు తప్పనిసరిగా ఫిజికల్ క్లాసులో వింటేనే అర్థమవుతుందనీ, లేకుంటే కష్టమేనని టీచర్లు చెప్తున్నారు.

మ్యాథ్స్​లో పెద్దగా తగ్గించలే.. 

కరోనా నేపథ్యంలో టెన్త్​లో అన్ని సబ్జెక్టుల్లో 30శాతం సిలబస్​తగ్గించినట్టు ఆఫీసర్లు ప్రకటించారు. అయితే మ్యాథ్స్​లో తక్కువ సిలబస్ తగ్గించారనే ఆరోపణలున్నాయి. మొత్తం14 చాప్టర్లుంటే, ఏ ఒక్క చాప్టర్​నూ అధికారులు పూర్తిగా తొలగించలేదు. దీంతో అన్ని చాప్టర్లూ​స్టూడెంట్స్ చదవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మొత్తం 60 టాపిక్స్ లో17 టాపిక్స్​ను తీసేసినట్టు ప్రకటించారు. వీటిలో కొన్ని టాపిక్స్.. తొలగించిన వాటిని చదివితే తప్పా, అర్థంకావు. దీంతో అనివార్యంగా తీసేసిన కొన్ని చాప్టర్లు కూడా చదవాల్సిందేనని టీచర్లే చెబుతున్నారు. మూడు చాప్టర్లలో అన్ని టాపిక్స్ కొనసాగించగా, ఆరు చాప్టర్లలో ఒక్కో టాపిక్, నాలుగు చాప్టర్లలో రెండేసి టాపిక్​లు సిలబస్​నుంచి తీసేశారు. అయితే మిగిలిన అన్ని సబెక్టుల్లోనూ చాప్టర్ల వారీగా సిలబస్​తీసేయగా, మ్యాథ్స్​లో మాత్రం టాపిక్స్ తీసెయ్యకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు సబ్జెక్టులో12 చాప్టర్లుంటే మూడు, ఉర్దూలో14 చాప్టర్లుంటే నాలుగు, హిందీలో 12 చాప్టర్లుంటే రెండు, ఫిజిక్స్​లో 12 చాప్టర్లలో మూడు పూర్తిగా తీసేసి, ఒకచాప్టర్లలో కొంత సిలబస్ తగ్గించారు. బయాలజీలో 10 చాప్టర్లలో మూడు, ఇంగ్లిష్​లో 8 చాప్టర్లుంటే రెండు, సోషల్​లో 21 చాప్టర్లలో ఆరు పూర్తిగా తీసేశారు.

సిలబస్ మరింత తగ్గించాలె

మా అబ్బాయికి అన్ని సబ్జెక్టుల్లో 90 శాతానికిపైగా మార్కులొస్తాయి. కానీ మ్యాథ్స్​లో 40 వరకే వస్తుంటాయి. కరోనా టైమ్​లో 30 % సిలబస్​తగ్గించినా, అది తగ్గించినట్టే లేదని మా అబ్బాయి అంటున్నాడు. మ్యాథ్స్​టఫ్​సబ్జెక్టు కాబట్టి, కనీసం ఐదారు చాప్టర్లు పూర్తిగా తీసేయ్యాలి. లేకపోతే చాలామంది ఫెయిల్ అవుతారు. ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

– శేఖర్ రెడ్డి, పేరెంట్, హైదరాబాద్  

For More News..

గ్రెటా థన్​బర్గ్  ‘టూల్ కిట్’ కేసు.. పరారీలో ఇద్దరు!

పాడి రైతులకు ఇన్సెంటివ్​ రావట్లే

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ