SSC కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారా..కీలక అప్డేట్..తప్పక తెలుసుకోవాల్సిందే

SSC కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారా..కీలక అప్డేట్..తప్పక తెలుసుకోవాల్సిందే
  • మే 1 2025 నుంచి ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షా ప్రోటోకాల్‌లో కీలక అప్డేట్స్ ప్రకటించింది. పరీక్షల సమయంలో ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. అభ్యర్థులు ధృవీకరణ క్రమబద్దీకరణ, ప్రభుత్వ నియామకాల్లో సమగ్రత బలోపేతం లక్ష్యంగా ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది. మే 1, 2025 నుంచి అన్ని SSC పరీక్షలు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అమలు చేయనున్నారు. 

ఆదివారం (ఏప్రిల్20) SSC పరీక్షా ప్రోటోకాల్ పై అధికారిక ప్రకటన చేసింది. భవిష్యత్తులో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన  12 అంకెల ఆధార్‌ను ఉపయోగించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా తమ గుర్తింపును ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. 

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో
  • దరఖాస్తు ఫారంను సమర్పించేటప్పుడు
  • పరీక్షా కేంద్రంలో భౌతికంగా హాజరయ్యేటప్పుడు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. 

ఈ విధానం స్వచ్ఛందంగా ఇంతకుముందే ఉన్నప్పటికీ పోటీ పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకొచ్చారు. 

స్టాప్ సెలక్షన్ కమిషన్(SSC) కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద నియామక సంస్థల్లో ఒకటి. SSC ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు,వివిధ విభాగాలలో నాన్-గెజిటెడ్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGLE), మూడు లిమిటెడ్ డిపార్టుమెంటల్ పోస్టుల పోటీ పరీక్షలు లను SSC  నిర్వహిస్తుంది. 

ఇటీవలి పబ్లిక్ నోటీసు ప్రకారం SSC పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మూడు దశల్లో ఆధార్ ఉపయోగించి తమ గుర్తింపును ధృవీకరించుకోవాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ,దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు,పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి.