
మహేష్ బాబు (SSMB29) మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. మహేశ్ - రాజమౌళి మూవీ కొన్ని రోజులుగా ఒడిశాలో షూటింగ్ జరుగుతోంది. ఒడిశా కోరాపుట్ జిల్లాలోని అందమైన ప్రదేశాలలో రెండు వారాల పాటు SSMB29 షూటింగ్ చేసి షెడ్యూల్ను ముగించారు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. అక్కడ సుమారు 15 రోజుల పాటు జరిగిన SSMB29 చిత్రీకరణలో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు జక్కన్న.
లేటెస్ట్ గా మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా ఒడిషాలో షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా అక్కడ కొందరు అభిమానులు, స్థానిక అధికారులతో ఫొటోలు కూడా దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే రాజమౌళి రాసిన థాంక్స్ గివింగ్ లెటర్ సైతం ఇపుడు వైరల్ అవుతోంది.
ఈ లెటర్ లో కోరాపుట్ ప్రజల ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజమౌళి లేఖ రాశారు. ఆ లేఖలో, “ప్రియమైన కోరాపుట్, మీ హృదయపూర్వక ఆతిథ్యానికి ధన్యవాదాలు. #SSMB29 సెట్ల నుండి ఇలాంటి అడ్వెంచర్స్ మరిన్ని ఉండాలని అనుకుంటున్నా. ప్రేమతో SSMB29 టీమ్ ” అంటూ రాసిన ఈ లేఖ ట్రెండ్ అవుతుంది. అయితే, ఇది రాశింది రాజమౌళియేనా కాదా అనే దానిపై ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ, అది ప్రజాదరణ పొందుతోంది.
The @ssrajamouli thanks the Odisha team shares moments ❤️.
— Maheshbabu Fan Club (@MaheshBabu_FC) March 18, 2025
Ssr & @priyankachopra & fans on the sets of #SSMB29 pic.twitter.com/QkUY57itwF
అయితే, ఈ లేఖ ద్వారా ఓ క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లు మహేశ్ బాబు - రాజమౌళి సినిమా వర్కింగ్ టైటిల్ పై కాస్తా సందేహం ఉండేది. అందులో కొందరు SSMB29 అంటుంటే, మరికొందరు SSRMB 29 అంటున్నారు. ఇక ఈ తాజా లెటర్ తో SSMB29 అనే క్లారిటీ వచ్చింది.
SSMB 29 సినిమా కథ అమెజాన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడో ఓ కొత్త లీక్ మాత్రం కాస్త కొత్త కోణాన్ని చూపిస్తోంది. అడ్వెంచర్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, మైథలాజి అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
SSMB 29 సినిమా చరిత్ర, పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని సమాచారం. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో భారీ సెట్‌లో SSMB29 బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తోంది. శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసిందేకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడట.