ఇస్రో.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇప్పుడు ఒక భారీ లక్ష్యాన్ని సెట్ చేసుకుంది. రాబోయే పదేళ్లలో భారత అంతరిక్ష పరిశ్రను 10బిలియన్ డాలర్లకు పెంచాల ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇస్రో తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది.. ఇప్పటివరకు ఇస్రో సాధించిన విజయాలు, మిషన్లు ఈ లక్ష్యానికి ఏ విధంగా ఉపయోగ పడతాయో చూద్దాం.
భారత అంతరిక్ష పరిశ్రమ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని.. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ అభివృద్దిని సాధిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. రాబోయే 5-10 ఏళ్లలో దేశ అంతరిక్ష పరిశ్రమ 2 బిలియన్ల నుంచి 9-10 బిలియన్ డాలర్లకు ఎదుగుతుందని చెప్పారు. ఇస్రో తన వివిధ మిషన్ల కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీ నుంచి 400 ప్రైవేట్ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయన్నారు. SFO అంతరిక్ష రంగంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను మరింత ప్రభావితం చేస్తుందన్నారు.
హైటెక్ పార్క్, కలమసేరిలో NEST గ్రూప్ SFO టెక్నాలజీస్ జీరో ఎమిషన్ ఇనిషియేటివ్‌ను సోమవారం (మే13) ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ ప్రారంభించారు. నెస్ట్ ఇంజనీర్లు, మేనేజ్ మెంట్ బృందంలో అంతరిక్ష రంగం గురించి , ఇస్రో, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం గురించి మాట్టాడారు. SFO టెక్నాలజీస్, ఇస్రోతో సహకారానికి చిహ్నంగా క్యాంపస్ లో చంద్రయాన్ నమూనాను ఆవిష్కరించారు. చంద్రయాన్ ఆదిత్య మిషన్లకున్ల ఉపవ్యవస్థలు, యాంటెన్నా సిస్టమ్స్ తయారీ, ప్రయోగ వాహనాల కోసం క్రయోజెనిక్ ఇంజిన్ నియంత్రణ వ్యవస్థల వంటి బహుళ ప్రోగ్రామ్లలో టెక్నాలజీస్ ఇస్రోతో కలిసి పనిచేస్తుందన్నారు.