సిద్దిపేట టౌన్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీయడానికే సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. ఆటల్లో గెలుపు, ఓటముల కంటే వాటిలో పాల్గొనడమే ముఖ్యమన్నారు.
జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్యా మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన ఆటగాళ్లను రాష్ట్ర స్థాయికి పంపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన డ్యాన్సులు అందరిని అలరించాయి. కార్యక్రమంలో అధికారులు, వివిధ క్రీడల అసోసియేషన్ల ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.