ఎమర్జెన్సీ కేసులకు చికిత్స​ చేయాలి : జాటోతు హుస్సేన్ నాయక్

యాదాద్రి, వెలుగు : ఎయిమ్స్​లో ఎమర్జెన్సీ కేసులను చేర్చుకొని చికిత్స​చేయాలని ఎస్టీ కమిషన్​మెంబర్​ జాటోతు హుస్సేన్ నాయక్​ వైద్యులకు సూచించారు. ఈ విషయంలో సదుపాయాలను సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడుతానని తెలిపారు. యాదాద్రి జిల్లా బీబీనగర్​లోని ఎయిమ్స్​ను ఆయన సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎయిమ్స్​ డైరెక్టర్​వికాస్​భాటియా, స్టాఫ్​తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హుస్సేన్​నాయక్​మాట్లాడుతూ సరిపోను ఫండ్స్​అందుబాటులో ఉన్నా.. నిర్మాణపు పనులను కాంట్రాక్టర్​ఆలస్యం చేస్తున్నట్టుగా కన్పిస్తోందని తెలిపారు. ఇరుకు గదుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారన్నారు. ట్రీట్​మెంట్​కు వస్తున్నవారికి సరైన సదుపాయాలు కల్పించలేదన్నారు. అనంతరం భువనగిరిలో నిర్మిస్తున్న బస్వాపూర్​రిజర్వాయర్​ను ఆయన పరిశీలించారు.