గిరిజన కళలపై స్టూడెంట్లకు సమ్మర్ క్యాంప్

గిరిజన కళలపై స్టూడెంట్లకు సమ్మర్ క్యాంప్

హైదరాబాద్, వెలుగు: వేసవి సెలవుల్లో సెల్ ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూస్తే హెల్త్ పాడవడంతోపాటు మైండ్ డైవర్ట్ అవుతుందని చిన్నారులను ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి హెచ్చరించారు.సెలవుల్లో సమయాన్ని తగిన విధంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం మసాబ్ ట్యాంక్ డీసీసీ భవన్ లోని ట్రైబల్ మ్యూజియంలో స్కూల్ పిల్లలకు గిరిజన కళలపై ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ ను సెక్రటరీ సీతాలక్ష్మి ప్రారంభించారు. ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ క్యాంప్ కు వివిధ స్కూళ్ల నుంచి సుమారు 50 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 

గిరిజనుల జీవన స్థితిగతులు, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్కీంలపై అవగాహన పెంచుకోవాలని చిన్నారులకు సూచించారు. తొలిసారి హైదరాబాద్‌లో ఈ తరహా క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ర్టంతో పోలిస్తే గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్కీంలలో భాగంగా  వేల కోట్ల ఫండ్స్ గిరిజనలకు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. టీఆర్ఐ డైరెక్టర్ సముజ్వల, జీసీసీ జీఎం సీతారాం, ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.