
- 11 మందికి 90% పైగా పర్సంటైల్
హైదరాబాద్, వెలుగు: జేఈఈ ఎంట్రన్స్ లో ఎస్టీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఎస్టీ గురుకులాలు, ఈఎంఆర్ఎస్ (ఏకలవ్వ మోడల్ రెసిడెన్షియల్ సొసైటీ ) నుంచి మొత్తం 398 మంది అర్హత సాధించారని ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి వెల్లడించారు. ఇందులో ఆరుగురు వెయ్యి లోపు ర్యాంకులు సాధించారని శనివారం ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. విశాల్ అనే విద్యార్థికి 96 శాతం పర్సంటైల్ రాగా, 11 మందికి 90 శాతం పర్సంటైల్ వచ్చిందని వివరించారు.
ఈ ర్యాంకుల ద్వారా 127 మంది ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీల్లో సీట్లు సాధిస్తారని ఆమె పేర్కొన్నారు. వచ్చే నెల 18న జరగనున్న ఎగ్జామ్ కు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ర్యాంకులు సాధించిన స్టూడెంట్లను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ అభినందనలు తెలిపారు.