కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో శ్రీలంక స్టార్ ప్లేయర్స్ వనిందు హసరంగా, నువాన్ తుషార దూరం కానున్నారు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరపున వీరిద్దరూ ఆడుతున్నారు. ఇటీవలే భారత్ తో జరిగిన సిరీస్ కు గాయం కారణంగా దూరమయ్యారు. వీరు ఇంకా కోలుకోకపోవడంతో కరీబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ ఇద్దరూ స్టార్ లేకపోవడంతో ఆ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. వీరి స్థానాల్లో జట్టులోకి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అన్రిచ్ నోకియా, తబ్రైజ్ షమ్సీని సెయింట్ కిట్స్ తీసుకున్నారు. త్వరలోనే వీరు జట్టుతో చేరనున్నారు.
ఆగస్టు 29 నుంచి కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన వీరిద్దరూ అదే ఫామ్ ను కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రదర్శించాలని ఆ జట్టు ఫ్రాంచైజీ భావిస్తోంది. అన్రిచ్ నోకియాకు ఇదే తొలి సీపీఎల్.. కాగా షంసి కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరపున 27 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు తీసుకున్నాడు. నోకియా, షమ్సీతో పాటు ఈ జట్టులో రిలీ రోసౌ, ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో ఇద్దరు పవర్ హిట్టర్లు ఉన్నారు.
మొత్తం 6 జట్లు తలపడే ఈ టోర్నీ ఆగస్టు 29న ప్రారంభమై అక్టోబర్ 6న ముగియనుంది. జమైకా తల్లావాస్ జట్టు స్థానంలో కొత్తగా ఈ ఎడిషన్‌లో ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది సీపీఎల్ సీజన్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 10 మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశ ముగిసే సమయానికి అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
పాల్గొనే జట్లు: 6
గయానా అమెజాన్ వారియర్స్
ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
సెయింట్ లూసియా కింగ్స్
ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్
సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్
బార్బడోస్ రాయల్స్
Sri Lanka's🇱🇰 Wanindu Hasaranga and Nuwan Thushara will miss CPL 2024 due to injuries!🤕
— CricketGully (@thecricketgully) August 10, 2024
South Africa's🇿🇦 Anrich Nortje and Tabraiz Shamsi to replace them in the ST Kitts & Nevis Patriots' squad for CPL 2024!🔄🏏 pic.twitter.com/UZiCDJ32u3