ఎల్బీ నగర్, వెలుగు: డిప్యూటీ కమిషనర్గా సేవా ఇస్లావత్ వచ్చినప్పటి నుంచి మానసికంగా ఎంతో వేదనకు గురవుతున్నామని ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలోని ట్యాక్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆరోపించారు. ఆయన పని ఒత్తిడి, వేధింపులు భరించలేమని -జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని ఒత్తిడితో తమను ఎంతో ఇబ్బందులకు గురి చేసున్నారన్నారు.
ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కనీసం తమతో మాట్లాడానికి కూడా ఇష్టపడట్లేదన్నారు. ఆయన వేధింపుల కారణంగానే ఇదే సర్కిల్ పరిధిలో ట్యాక్స్ ఇన్స్స్పెక్టర్గా పని చేస్తున్న శ్రీనివాస్ రాజు హైబీపీతో బ్రెయిన్లోబ్లడ్ క్లాట్అయి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణపాయస్థతిలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి సమయంలోనూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు కూడా ఆయన ముందుకు రాలేదన్నారు.
ఇలా అయితే ఆయన కింద తాము పని చేయలేమని, తమను బదిలీ చేయాలని వేడుకున్నారు. ఈ ధర్నాలో ఎల్బీనగర్ జోన్పరిధిలోని ఐదు సర్కిళ్ల ట్యాక్స్వింగ్ సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అయితే, తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, వారి పనులను మాత్రమే చేయాలని సూచించినట్లు ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్సేవా ఇస్లావత్ వివరణ ఇచ్చారు.