మరికల్, వెలుగు: పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు 108లో సిబ్బంది కాన్పు చేశారు. తల్లితో పాటు కవల పిల్లలు క్షేమంగా ఉన్నారు. మక్తల్‌కు చెందిన అంకితకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, నారాయణపేట జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో మహబూబ్‌నగర్‌కు వెళ్లాలని సూచించారు.
పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది పురుడుపోశారు. పాప, బాబు పుట్టారు. తల్లి, పిల్లలను వెంటనే మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లితో పాటు కవలలు క్షేమంగా ఉన్నట్లు ఈఎంటీ కృష్ణమ్మ, పైలెట్ ఖదీర్ తెలిపారు. 108 సిబ్బందికి అంకిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.