ఇక్కడ కాదు ప్రైవేట్ హాస్పిటల్​కి వెళ్లండి .. మహిళకు స్టాఫ్ నర్స్ సలహా

ఇక్కడ కాదు ప్రైవేట్ హాస్పిటల్​కి వెళ్లండి .. మహిళకు స్టాఫ్ నర్స్ సలహా

కాగ జ్ నగర్, వెలుగు: ఇక్కడ సార్ లేరు. చిన్న పిల్లలకు ట్రీట్​మెంట్ ఇవ్వరు.. దగ్గర లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్​కి వెళ్లండి’ అంటూ పీహెచ్​సీ స్టాఫ్ నర్స్ ఉచిత సలహా ఇచ్చింది. కౌటాల మండల కేంద్రంలోని పీహెచ్​సీకి సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో దుర్గమ్మ అనే సంచార మహిళ తన ఏడాది వయసున్న కొడుకు మహేశ్ బాబుతో వచ్చింది. అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ శ్యామల దగ్గరకు వెళ్లి బాబుకి జ్వరం ఉందని చెప్పింది. 

దీంతో ఆమె ‘డాక్టర్ బయటకు వెళ్లారు.. ఇప్పుడే రారు. దగ్గరలో ఉన్న ప్రైవేట్ పిల్లల హాస్పిటల్​కి వెళ్లండి’ అని చెప్పింది. దీంతో దుర్గమ్మ తమది ఈ ప్రాంతం కాదని బతుకుదెరువు కోసం వచ్చామని, డబ్బులు లేవంటూ బతిమిలాడింది. విషయం మీడియాకు తెలియడంతో అక్కడకు చేరుకొని ఆరా తీయగా సదరు స్టాఫ్ నర్స్ నేను అలా అనలేదు, కూర్చోవాలని చెప్పాను అంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. బయటకు వెళ్లిన డాక్టర్​కు పలు మార్లు ఫోన్ చేసి  వెంటనే రావాలని చెప్పింది. చివరికి డాక్టర్ అరగంటలో వచ్చి ట్రీట్​మెంట్​ చేశారు. అయితే డ్యూటీకి రావాల్సిన సిబ్బందిలో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ నినహా 11 గంటలకు కూడా పీహెచ్​సీలో ఎవరూ కనిపించలేదు.