
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ- టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు: మొత్తం 1,558 పోస్టుల్లో మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్- మినిస్టీరియల్): 1198, హవల్దార్ (గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్): 360 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్: ఎంటీఎస్ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు సెప్టెంబర్లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.