
ఢిల్లీ పోలీసు విభాగంలో 4300 సబ్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు: మొత్తం 4300 ఖాళీల్లో ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్(పురుషులు) 228, మహిళలకు 112 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సు(సీఆర్‌పీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్(జీడీ) ఖాళీలు 3960 అందుబాటులో ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ), మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 30 వరకు అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ నవంబర్లో ఉంటుంది. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.