లెక్కలు దండి.. మొక్కలు మాయం

  • ఉపాధి పనుల్లో తప్పుడు రికార్డులు
  • సోషల్‌‌‌‌‌‌‌‌ ఆడిట్‌‌‌‌‌‌‌‌లో బయటపడిన సిబ్బంది చేతివాటం

మొగుళ్లపల్లి, వెలుగు : ఉపాధి నిధులతో మొక్కలు నాటినట్లు రికార్డులు చూపుతూ లక్షలాది రూపాయలను సిబ్బంది కాజేశారు. ఈ విషయం సోషల్‌‌‌‌‌‌‌‌ ఆడిట్‌‌‌‌‌‌‌‌లో బయటపడింది. మండలంలోని 25 గ్రామాల్లో 2022 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి 2023 మార్చి వరకు చేపట్టిన 418 పనులకు సంబంధించి కూలీలకు చెల్లించిన రూ. 3.14 కోట్లు, మెటీరియల్‌‌‌‌‌‌‌‌ నిధులు రూ. 49 లక్షలపై సోమవారం సోషల్‌‌‌‌‌‌‌‌ ఆడిట్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లో పర్యటించి పనులను పరిశీలించడంతో పాటు ప్రజలతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సోషల్‌‌‌‌‌‌‌‌ ఆడిట్‌‌‌‌‌‌‌‌లో వివరాలు వెల్లడించారు. సిబ్బంది నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో అవి దుర్వినియోగం అయ్యాయన్నారు.

నాటిన మొక్కలను రక్షించడంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం చేశారు. కొన్ని చోట్ల పనులు చేయకుండా, మొక్కలు నాటకుండానే నిధులు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసి, వాటిని పక్కదారి పట్టించారని తెలిపారు. ఈ రిపోర్టును జిల్లా, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లకు అందించి దుర్వినియోగం అయిన నిధులను రికవరీచేయడంతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఏపీడీ అవినాశ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. కార్యక్రమంలో డీవీవో రుబీనా బేగం, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ధరం సింగ్‌‌‌‌‌‌‌‌, అంబుడ్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్, ఎంపీపీ సుజాత, ఎంపీడీవో కృష్ణవేణి, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఏపీవో తిప్పారపు రాము పాల్గొన్నారు.