ఇవాళ్టి (మార్చి12)నుంచి.. అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు

ఇవాళ్టి (మార్చి12)నుంచి.. అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు
  •  
  • ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం
  • మధ్యాహ్నం 2 గంటలకు సీఎల్పీ సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా వేస్తారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాలు-1 లో మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం సమావేశం కానుంది. 

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ శాసనసభ సభ్యులు, శాసమండలి సభ్యులు హాజరుకానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఎదుర్కొవడం, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమాచారం, ప్రతిప్రక్షాలు చేసే అసత్య ప్రచారంపై ఆధారాలతో సిద్ధంగా ఉండటం తదితర అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం. ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్​ రెడ్డి దిశానిర్ధేశం చేయనున్నారు.