స్టాలిన్, అతిథి, రెడీ, ఏక్ నిరంజన్, ఖలేజా, రాజన్న లాంటి పలు చిత్రాల్లో బాల నటిగా నటించిన ఆని హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘తికమక తాండ’. రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా వెంకట్ దర్శకత్వంలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘1990 గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ సమస్య వల్ల గ్రామం అంతా మతిమరుపుతో బాధపడుతుంటారు.
ఆ సమస్య నుంచి వారంతా ఎలా బయటపడ్డారనే కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నాం. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామంలో షూట్ చేశాం’ అన్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత చెప్పారు.