రాష్ట్ర గీతంలో ద్రవిడ పదం కావాలనే ఉచ్చరించలేదు: స్టాలిన్

రాష్ట్ర గీతంలో  ద్రవిడ  పదం కావాలనే ఉచ్చరించలేదు: స్టాలిన్

చెన్నై : తమిళనాడు రాష్ట్ర గీతాలాపనలో ‘ద్రవిడ’ అనే పదం పలకకుండా గవర్నర్‌‌ ఆర్‌‌ఎన్‌‌ రవి ఉద్దేశపూర్వకంగానే దాటవేశారని సీఎం స్టాలిన్‌‌ ఆరోపించారు. జాతి ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరించిన ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలంటూ కేంద్రానికి స్టాలిన్ లేఖ రాశారు. 

చెన్నైలోని దూరదర్శన్ ఆఫీస్​లో శుక్రవారం గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరిగింది. ఇదే ప్రోగ్రామ్​లో హిందీ మాసోత్సవ వేడుకలు కూడా నిర్వహించారు. దీనికి గవర్నర్ ఆర్ఎన్ రవి హాజరయ్యారు. తమిళనాడు రాష్ట్ర గీతం ‘తమిళ తాయ్ వజ్తు’ను ఆలపించారు. సాంగ్​లోని ‘ద్రవిడ’ అనే పదాన్ని గాయకులెవరూ ఉచ్చరించలేదు. దీంతో సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.