ఆర్ఆర్ కాలనీలో స్కూల్ పనులు స్టార్ట్

గద్వాల, వెలుగు: చిన్నోనిపల్లి ఆర్అండ్ఆర్ సెంటర్ లోని స్కూల్​ పెండింగ్ పనుల్లో కదలిక వచ్చింది. కొన్నేళ్లుగా నిలిచిపోయిన స్కూల్  బిల్డింగ్  పనులను ఎట్టకేలకు ప్రారంభించారు. చిన్నోనిపల్లి ఆర్అండ్ఆర్​ సెంటర్ లో సౌలతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

గ్రామంలో స్కూల్  బిల్డింగ్​ లేకపోవడంతో షెడ్​లో స్కూల్ ను నిర్వహిస్తున్న విషయంపై ఇటీవల వెలుగు దినపత్రికలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ఆఫీసర్లు స్కూల్ పనులు కంప్లీట్ చేసేందుకు చర్యలు తీసుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.