న్యూఢిల్లీ: రిఫ్రిజిరెంట్ల (వేడిని తగ్గించే పదార్ధాల) ను సప్లయ్ చేసే స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కి వెళ్లేందుకు సెబీ నుంచి అనుమతులు పొందింది. కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం, ఫ్రెష్‌గా ఇష్యూ చేసిన 1.78 కోట్ల షేర్లను ఐపీఓలో అమ్మనున్నారు. మరో 43.01 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ప్రమోటర్ షాజద్ షెరియర్ రుస్తోమ్జీ సేల్ చేయనున్నారు.
ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల కోసం, కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ ఖర్చు చేయనుంది. స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ ప్రిలిమినరీ ఐపీఓ పేపర్లను ఈ ఏడాది మార్చిలో సెబీ దగ్గర ఫైల్ చేసింది.