చర్లపల్లి టెర్మినల్​లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్లకు స్టాల్

హైదరాబాద్​సిటీ, వెలుగు: చర్లపల్లి టెర్మినల్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ల కోసం అధికారులు స్టాల్​కేటాయించారు. ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ పేరుతో నిర్వహించే ఈ  స్టాల్ ను ట్రాన్స్​జెండర్​మెంబర్స్​గా ఉండి నిర్వహించుకోనున్నారు. ఇందులో స్నాక్స్, జూట్ బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సబ్బులు, చేతితో తయారు చేసిన ఉత్పత్తులను అమ్మనున్నారు. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్ జాస్మిన్ ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు.

‘చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాకు ఒక స్టాల్, ట్రాలీ స్టాండ్ ను అధికారులు కేటాయించారు. దీంతో మా చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం కలిగింది.’ అని అన్నారు. తాము తయారుచేసిన జనపనార సంచులను, సబ్బులను ఇక్కడి స్టాల్​లో అమ్మడం ఆనందాన్నిస్తోందని త్రిపుర, సహస్ర అనే  ట్రాన్స్ విమెన్స్, ట్రాన్స్​మెన్​కిరణ్ రాజ్ చెప్పారు. చర్లపల్లి టెర్మినల్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓపీ స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించే అవకాశం ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండర్లకు లభించడం సంతోషకరమన్నారు.