ఇంత కరువులో ఉన్నారా: ఫ్రీ చికెన్ హలీం కోసం ఎగబడ్డ జనం..

ఇంత కరువులో ఉన్నారా: ఫ్రీ చికెన్ హలీం కోసం ఎగబడ్డ జనం..

బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందన్న వార్తలు రాగానే చికెన్ కొనడమే మానేసిన జనం ఫ్రీ చికెన్ అంటే మాత్రం ఎగబడి తింటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఫ్రీ చికెన్ మేళా నిర్వహించిన ఇదే సీన్ కనిపిస్తోంది. ఫ్రీ చికెన్ కోసం జనాలు వరద బాధితుల్లాగా ఎగబడుతున్నారు. ఫ్రీ చికెన్ కోసం జనం ఎగబడటంత చాలా చోట్ల తోపులాట కూడా జరిగింది.. ఇదిలా ఉండగా రేపు ( మార్చి 2 ) రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో కరీంనగర్ లో ఈట్ మోర్ అనే సంస్థ ఫ్రీ చికెన్ హలీం మేళా నిర్వహించింది. ఫ్రీగా చికెన్ ఇస్తామంటేనే ఎగబడుతున్న జనం ఇక హలీం అంటే ఆగుతారా.. తోపులాట జరిగే రేంజ్ లో ఎగబడ్డారు జనం.

శనివారం ( మార్చి 1, 2025 ) కరీంనగర్ లోని జ్యోతిబాపూలే గ్రౌండ్లో ఉచిత చికెన్ హలీం మేళా నిర్వహించింది ఈట్ మోర్ అనే సంస్థ. బకెట్ల కొద్దీ హలీం అలా తెస్తే.. ఇలా అయిపోయే రేంజ్ లో తిన్నారు జనం. తమ వంతు రాకముందే హలీం ఎక్కడ అయిపోతుందో అని ఆత్రంగా జనం ఎగబడటంతో హలీం మేళాలో తోపులాట చోటు చేసుకుంది. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ తోపులాట జరిగిందంటే అర్థం చేసుకోండి జనం ఏ రేంజ్ లో హలీం కోసం ఎగబడ్డారో.

ALSO READ : దేశంలో రేపటి(మార్చి 2) నుంచి రంజాన్ మాసం ప్రారంభం

బర్డ్ ఫ్లూ సంగతి పక్కన పెడితే.. రంజాన్ సీజన్లో చికెన్ హలీం సేల్స్ కి ఢోకా లేదని...  రెస్టారెంట్ ఓనర్లకు ఈ హలీం మేళాతో ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది. మరి, ఫ్రీ చికెన్ హలీం కి ఎగబడ్డ జనంలో సగం మంది అయినా రంజాన్ సీజన్లో హలీం కొనుక్కొని రెగ్యులర్ గా తింటారో లేదో చూడాలి.