
వరంగల్ లో నిర్వహించిన మెగాజాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జాబ్ మేళాకు యువత భారీగా వచ్చారు. ప్రాంగణంలో నిరుద్యోగులు కిక్కిరిసిపోయారు. గేట్ తీయగానే నిరుద్యోగులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ముగ్గురు నిరుద్యోగ మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే గాయాలైన వాళ్లను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మంత్రి కొండా సురేఖ జాబ్ మేళాను ప్రారంభించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.
►ALSO READ | హైదరాబాద్ లో కల్తీ ఫుడ్ లపై ఉక్కుపాదం..రోడ్డెక్కనున్న ఫుడ్ టెస్టింగ్ వ్యాన్
టాస్క్ ఆధ్వర్యంలో 'ప్లేస్ మెంట్స్ ఫర్ లోకల్ యూత్'లో భాగంగా మంత్రి కొండా సురేఖ, తన సొంత నియోజకవర్గం వరంగల్ ఈస్ట్ లో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాలులో ఏప్రిల్ 11న (శుక్రవారం) మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో జెన్ ప్యాక్ట్, భారత్ బయోటెక్, హెచ్డీబీ, పేటీఎం, జీఎంఆర్, జస్ట్ డయల్, అపోలో ఫార్మసీ, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఐడీబీఐ బ్యాంక్ తదితర 50కిపైగా పేరుమోసిన కంపెనీలు పాల్గొన్నాయి.
పోటెత్తిన నిరుద్యోగులు.. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట pic.twitter.com/xg2634kcJf
— DJ MANI VELALA (@MaNi_ChiNna_) April 11, 2025