ఛీ..ఛీ.. సిగ్గులేకపోతే సరి.. కన్నతల్లి గురించి ఏంటీ కూతలు.. స్వాతి సచ్దేవా వీడియోపై దుమారం

ఛీ..ఛీ.. సిగ్గులేకపోతే సరి.. కన్నతల్లి గురించి ఏంటీ కూతలు.. స్వాతి సచ్దేవా వీడియోపై దుమారం

స్టాండప్ కామెడీ పేరుతో నోటికొచ్చిన చెత్తంతా వాగుతూ విమర్శలు ఎదుర్కొంటూ, వివాదాల్లో చిక్కుకుంటూ.. కొందరు యూట్యూబర్లు కోరి కొరివితో తల గోక్కుంటున్నారు. మిలియన్ల కొద్దీ వ్యూస్ కోసం, వేల కొద్దీ లైక్స్ కోసం శ్రుతి మించిన అశ్లీలాన్ని జనం మెదళ్లలో జొప్పిస్తూ సమాజానికి చెద పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా పైత్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమై దేశవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినా కొందరి తీరు మారడం లేదు.

తాజాగా.. మరో స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్దేవా(Swati Sachdeva) అనే యువతి ‘‘వైబ్రేటర్’’ వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమన్నారు. Swati Sachdeva అనే పేరుతో ఉన్న ఈ యువతి యూట్యూబ్ ఛానల్కు 9 లక్షల పాతిక వేల మందికి పైగా సబ్ స్రైబర్లు ఉన్నారు. 9 రోజుల క్రితం Family First అనే టైటిల్తో ఆమె తన ఛానల్లో స్టాండప్ కామెడీ పేరుతో ఒక వీడియోను అప్లోడ్ చేసింది. తాజాగా ఈ వీడియోలోని ఒక సంభాషణ నెట్టింట వైరల్ అయింది.

స్వాతి సచ్దేవా వివాదాస్పద సంభాషణ యథాతథంగా..
‘‘మా అమ్మ కూల్ మామ్ అనిపించుకునేందుకు ట్రై చేస్తుంటుంది కానీ అది అవ్వదు. నా వైబ్రేటర్ ఆమెకు దొరికింది. నాకు అదో పెద్ద ట్రాజెడీ. ఆమె నా దగ్గరకు ఫుల్ కాన్ఫిడెన్స్తో వచ్చి ఒక ఫ్రెండ్లా మాట్లాడేందుకు ప్రయత్నించింది. కచ్చితంగా ఆమె నా వైబ్రేటర్ గురించి అడుగుతుందని నాకర్థమైపోయింది. అనుకున్నట్టే.. అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు.. ఈ గ్యాడ్జెట్ ఏంటి..? ఈ బొమ్మేంటి..? అని అమ్మ అడిగింది. ఆమెకు అదేంటో చెప్పి దొరికిపోకూడదని ‘‘నీ మీద ఒట్టు అమ్మా.. అది నాన్నది’’ అని చెప్పాను. అందుకు మా అమ్మ బదులిస్తూ.. ‘‘నోర్ము్య్.. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.. మీ నాన్న ఛాయిస్ ఏంటో నాకు తెలుసు’’ అని చెప్పింది.

డార్క్ కామెడీ పేరుతో కన్న తల్లిదండ్రులపై, వారి ప్రైవేట్ విషయాలపై స్వాతి సచ్దేవా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. నెటిజన్లు స్వాతిపై విరుచుకుపడ్డారు. డబ్బు పిచ్చితో కన్న తల్లిదండ్రులను కూడా కించపరిచిన ఇలాంటి వాళ్లను వదలేయకూడదని, కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. మరో నెటిజన్ ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తూ.. స్వాతి సచ్ దేవా ఢిల్లీకి చెందిన అమ్మాయి అని, AMITY యూనివర్సిటీలో చదువుకుందని, ఉద్యోగం సాధించడం చేతకాక అడల్ట్ కంటెంట్ రాయడం మొదలుపెట్టి డబ్బు కోసం, ఫేమ్ కోసం ఇలా కన్న తల్లిని కూడా అవమానించేలా మాట్లాడుతుందని ఆమెపై మండిపడ్డారు. సమయ్ రానా, అపూర్వ మఖిజా, రణ్​వీర్ అల్హాబాదియా తరహాలో స్వాతి సచ్ దేవాపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.